Wednesday, April 22, 2026
[t4b-ticker]

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ వేడుకలు

ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ వేడుకలు

భూమి మీద దేవతలు తల్లిదండ్రులే

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): ఎస్సార్ ప్రైమ్ స్కూల్లో జోనల్ ఇంచార్జ్ స్నేహలత ఆధ్వర్యంలో ఘనంగా ఫ్యామిలీ ఫెస్ట్ వేడుకలు నిర్వహించారు. స్నేహలత మాట్లాడుతూ విద్యార్థుల ప్రతి విజయానికి కారణం తల్లిదండ్రులే అని అన్నారు. ప్రతి ఉపాధ్యాయుడు తల్లిదండ్రులతో సమానమని అన్నారు. ప్రతి విద్యార్థికి మొదటి పాఠశాల తమ ఇల్లే అని, మొదటి టీచర్ తల్లిదండ్రులని అన్నారు. భూమి మీద దేవతలు తల్లిదండ్రులే అని అన్నారు. విద్యార్థుల ప్రతి విజయంలో తల్లితండ్రుల పాత్ర అమోఘమని అన్నారు. ప్రిన్సిపల్ పుల్లయ్య మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు విద్యార్థుల కోసం తమ జీవితాలను అర్పిస్తారని అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకున్నారు. మన పాఠశాల సంస్కృతి,సంప్రదాయాలకి నిలయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular