పట్టణ పారిశుద్ధ్యంలో ప్రజలు భాగస్వాములు కావాలి…
:ప్రజల సహాకారం తో కాలుష్య రహిత కోదాడ గా తీర్చిదిద్దుతా….
:తడి చెత్త పొడి చెత్త లను వేరు చేసి ఇవ్వాలి….
:పట్టణ పారిశుద్ధ్య నికే తొలి ప్రాధాన్యత….
:మున్సిపల్ పరిధిలోని 3,4 వార్డుల్లో ప్రజా పాలన ప్రగతి..
:ప్రణాళిక వార్డు సభలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు..
Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 30(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పారిశుద్ధ్యంలో ప్రజలు భాగస్వాములు కావాలని కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమా వెంకటరత్నం బాబు అన్నారు. గురువారం కోదాడ మున్సిపల్ పరిధిలోని మూడు, నాలుగోవ వార్డులో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా నిర్వహించిన వార్డు సభల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజల సహాకారం తో కాలుష్య రహిత కోదాడ గా తీర్చిదిద్దు తామన్నారు. పట్టణ పారిశుద్ధ్య నికే తొలి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే పద్మావతి సహాకారం తో పారి శుద్ధ్యం పనులకు నిధులు మంజూరు చేస్తా మన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో మునిసిపల్ అన్ని శాఖలు సమన్వయం తో పని చేసి ప్రభుత్వ లక్ష్యాలు సాధించాలన్నారు. వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మల్లీశ్వరి, మున్సిపల్ కమిషనర్ రమాదేవి, మూడో వార్డు కౌన్సిలర్ వంగూరి గోపి, 4వ వార్డు కౌన్సిలర్ సుల్తానీ సుజాత రాంబాబు, హాస్టల్ వార్డెన్ రుక్మిణి, వార్డు ప్రజలు, సిబ్బంది ఉన్నారు.



