వరి కోయ్యలను బహిరంగ వ్యర్థాలను కాల్చవద్దు
: సర్పంచి పాలకి సురేష్
Mbmtelugunews//కోదాడ, మే 30(ప్రతినిధి మాతంగి సురేష్): పొలాలలో వరి కొయ్యలను గ్రామంలోని బహిరంగ వ్యర్ధాలను తగలబెట్టొద్దని సర్పంచి పాలకి సురేష్ అన్నారు. మండల పరిధిలోని దోరకుంట గ్రామపంచాయతీ కార్యాలయం నందు శనివారం సర్పంచి పాలకి సురేష్ అధ్యక్షతన గ్రామంలో వరి కాల్చవద్దు, బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు అనే అంశంపై గ్రామసభ నిర్వహించి రైతులకు, ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఆర్డీవో సూర్యనారాయణ, ఎమ్మార్వో సంతోష్ కిరణ్ లు పాల్గొని మాట్లాడుతూ రైతులు వారి పంట కోసిన తర్వాత వరి కొయ్యలకు నిప్పు పెట్టడం వలన భూసారంలో ఉన్న సూక్ష్మజీవులు చనిపోయి పంట దిగుబడి తగ్గుతుందని అన్నారు. ఈ వేసవికాలంలో నిప్పు పెట్టడం వలన పంట పొలాలకే కాక పచ్చని చెట్లు తో పాటు గ్రామాలలో ఇండ్లు పొలాలలో మామిడి తోటలు బోర్లు గడ్డివాములు దగ్ధమవుతున్నాయని కావున ఎవ్వరు కూడా బహిరంగ వ్యర్ధాలకు వరి కొయ్యలకు నిప్పు అంటించరాదని అలా అంటించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ ప్రశాంతి, అగ్రికల్చర్ ఆఫీసర్ మహేష్, పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు రైతులు, ప్రజలు పాల్గొన్నారు.



