ఉత్తమ్ దంపతుల పై నిరాధారణమైన ఆరోపణలు
చేసినందుకు ఫిర్యాదు….
కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, పిల్లుట్ల శ్రీనివాస్..
Mbmtelugunews//కోదాడ, జూన్ 09 :తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు
ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలపై
నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పై కాంగ్రెస్ నాయకులు రావెళ్ల కృష్ణారావు, పిల్లుట్ల శ్రీనివాస్, లు స్థానిక డిఎస్పీకి ఫిర్యాదు చేశారు. మంగళవారం కోదాడ డిఎస్పి కార్యాలయంలో డిఎస్పి శ్రీనివాస్ రెడ్డికి ఫిర్యాదు చేసిన అనంతరం వారు మాట్లాడారు. హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాలలో వేలాదికోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తుంటే, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ రాజకీయ లబ్ధి కోసం నిరాధారమైన ఆరోపణ చేయటం సరైనది కాదన్నారు. అవినీతి ఆరోపణల పై ఆధారాలు ఉంటే సంబంధిత అవినీతి నిరోధక శాఖలకు ఫిర్యాదు చేయాలి, లేదా ప్రజాక్షేత్రంలో ఆధారాలను బహిర్గతం చేయాలి తప్ప, స్థానిక ఎమ్మెల్యేను, అధికారులను, కించపరిచే విధంగా వారిపై అవినీతి ఆరోపణలు చేయటం మానుకోవాలని హెచ్చరించారు. రాజకీయ లబ్ధి కోసం కోదాడ నియోజకవర్గంలోని ప్రభుత్వ అధికారులను, అధికారపక్ష నాయకుల పై నిరాధారమైన ఆరోపణలు చేసి రాజకీయ లబ్ధి చేకూరాలని ప్రయత్నించడం హేమమైన చర్యని అన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ రాజకీయ నాయకులు ఆధారాలు లేకుండా ఎవరి పై ఆరోపణలు చేయరాదని, అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఫిర్యాదు అందజేసిన వారిలో మైలారి శెట్టి భాస్కర్, పాలడుగు సంజీవ్, షరీఫ్, బాగ్దాద్, కామల్ల ప్రవీణ్, పిడతలు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.



