గణపవరంలో స్వేరోస్ రూపాంతర్ కార్యక్రమం.
Mbmtelugunews//కోదాడ, జూన్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గణపవరం గ్రామంలో ఇటీవల హత్యకు గురైన స్వేరోస్ సభ్యుడు బల్గూరి గణేష్ జ్ఞాపకంగా స్వేరోస్ రూపాంతర్ అనే ఒక వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న స్వేరోస్ చీఫ్ కన్వీనర్ బల్గూరి దుర్గయ్య మాట్లాడుతూ స్వేరోలకు మరణం ఉండదని వారు మరణించిన తర్వాత కూడా వారి అంతర శక్తి వివిధ రూపాలలో ఈ చుట్టూనే ఉంటుందని స్వేరోలు నమ్ముతారని, మరణించిన వారి కుటుంబ సభ్యులను మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టేలా మాంసం మందులతో అధిక ఖర్చులకు గురవడం ద్వారా ఆర్థికంగా చితికి పోతారని, అలాకాకుండా స్వీరోలు కేవలం పండ్లు, మజ్జిగ తో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి మరణించిన వారి గుర్తుగా ఒక మొక్కను నాటి అది వారి రూపముగా (రూపాంతర్) గుర్తించి దానిని పెంచి పోషించడం ద్వారా వారు మనతోనే ఉంటారని భావనను కలిగి ఉంటారని, అలాగే వారి జ్ఞానం పుస్తకాల రూపంలో ఉంచి వాటిని పంచడం ద్వారా వారి జ్ఞానాన్ని అందరికీ పంచినట్లు అవుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో సర్పంచి బల్గూరి స్నేహ దుర్గయ్య, రాష్ట్ర అధ్యక్షులు చిలకబత్తిని వీరయ్య, రాష్ట్ర నాయకులు చెరుకుపల్లి కిరణ్, స్వేరోకోర్ బాబు నాయక్, చెడపంగు రవి, వీరస్వామి, ఏసుబాబు, నాగార్జున, నిర్మల, జ్యోతి రాణి, రాకేష్, స్వేరో సభ్యులు గ్రామస్తులు బంధువులు తదితరులు పాల్గొన్నారు..



