ప్రజాసేవలో ఆమెకు సాటి ఎవరూ లేరు
:రాజకీయాల్లో మహిళా నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం పద్మావతి రెడ్డి.
:కోదాడ నియోజకవర్గం లో రూ.1938 కోట్ల నిధులతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రధాత.
:భాషబోయిన భాస్కర రావు
Mbmtelugunews//కోదాడ, జూన్ 17(ప్రతినిధి మాతంగి సురేష్) : కాంగ్రెస్ నాయకులు బాషబోయిన భాస్కర్ రావు ఆధ్వర్యంలో స్థానిక శాసన సభ్యురాలు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక బస్టాండ్ సెంటర్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
ప్రజాసేవను పరమావధిగా భావిస్తూ ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఆమె చూపుతున్న చొరవ, అభివృద్ధి పట్ల ఉన్న నిబద్ధత, ప్రజల పట్ల ఉన్న అంకితభావం ఆమెను ప్రత్యేక నాయకురాలిగా నిలబెట్టాయని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సుమారు రూ.1938 కోట్ల నిధులను తీసుకువచ్చి రహదారులు, తాగునీటి సదుపాయాలు, సాగునీటి ప్రాజెక్టులు, విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణ మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో వేగం పెంచి అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రగతి ప్రదాతగా పద్మావతి, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలిచారని తెలిపారు. ప్రజల అవసరాలను నేరుగా తెలుసుకునేందుకు నిరంతరం ప్రజల్లో ఉంటూ, ప్రతి వర్గానికి అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ఆమె ప్రజా ప్రతినిధిగా విశేష గుర్తింపు పొందారని అన్నారు. రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత, పారదర్శకతకు ప్రతీకగా నిలుస్తూ ప్రజా విశ్వాసాన్ని చూరగొన్న నాయకురాలిగా పద్మావతి ఉత్తమ్ రెడ్డి ఎదిగారని కొనియాడారు. నియోజకవర్గంలోని గ్రామాలు, తండాలు, పట్టణ ప్రాంతాల్లో సమాన అభివృద్ధి లక్ష్యంతో ముందుకు సాగుతూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రతి అర్హల కుటుంబానికి చేరేలా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారని తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా ఉంటూ, సామాన్య ప్రజలకు అండగా నిలుస్తూ, నిస్వార్థ సేవతో రాజకీయాలకు ఆదర్శంగా నిలిచిన ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కోదాడ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ఆమె చేపడుతున్న కృషి మరింత విజయవంతం కావాలని, భగవంతుడు ఆమెకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సుమారు 500 మందికి కేకు పులిహోరలో అందజేశారు. ఈ కార్యక్రమంలో పంది తిరుపతయ్య, రాయపూడి వెంకటనారాయణ, హనుమంతరావు, కాంపాటి శ్రీనివాసరావు, తాటికొండ నాగిరెడ్డి, లక్ష్మీనారాయణ, మహమ్మద్ రఫీ, మైకు నాగులు, కొరివి రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.



