గొప్ప విజయాలు సాధించాలంటే సూత్రాలు పాటించాలి…..
:విద్యార్థులు పాఠ్యాంశాలలో ని సారాంశాన్ని గ్రహించాలి…..
:బరోడా మహారాజు స్కాలర్షిప్ తో చదివి అంబేద్కర్ గొప్పవాడయ్యాడు…
:ఆణిముత్యాల ను వెలికి తీస్తున్న కత్రం చారిటబుల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి అభినందనీయుడు….
:సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ..
Mbmtelugunews//కోదాడ, జూన్ 21(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యార్థులు గొప్ప విజయాలు సాధించాలంటే సూత్రాలు పాటించాలని సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ అన్నారు. ఆదివారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో కతరం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కత్రం శ్రీకాంత్ రెడ్డి అభిజ్ఞ దంపతులు పదవ తరగతి లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అందిస్తున్న కత్రం యంగ్ ఇండియా మెరిట్ స్కాలర్షిప్ ల పంపిణీలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు ప్రతిభావంతులుగా మారాలంటే 6 పేజీల పాఠ్యాంశాన్ని మూడు పేజీల్లోకి రాయాలని అంటే సారాంశాన్ని గ్రహించాలని చెప్పారు. తమకు తెలిసిన అంశాన్ని ఇతరులకు తెలియజేయడం, ప్రశ్న పత్రాన్ని స్వయంగా తయారు చేసుకోవడం ,దోషాలను గుర్తించడం ప్రధానమన్నారు. మిస్సైల్ మ్యాన్ అబ్దుల్ కలాం అన్నట్లు కలలు కనండి… ఎలాంటి కలలు కనాలంటే లక్ష్య సాధన కు నిద్ర పట్టకుండా ఉండే కలలు కనాలన్నారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులు గర్వపడేలా, చదివిన పాఠశాల కి ముఖ్యఅతిథిగా వెళ్లేలా, తన సంతకాన్ని ఆటోగ్రాఫ్ గా అడిగే విధంగా లక్ష్యాలను ఏర్పరచుకొని సాధించాలన్నారు. నాడు బరోడా మహారాజ్ అంబేద్కర్ కు స్కాలర్షిప్ అందించకపోతే అంబేద్కర్ ఇంత గొప్ప ఆశయాలు సాధించడం కష్టం అయ్యేది అన్నారు. కత్రం శ్రీకాంత్ రెడ్డి ఈ సూపర్ 39 విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించడం అభినందనీయమన్నారు. ఈ 39 మంది విద్యార్థులు అబ్దుల్ కలాం మాదిరిగా శాస్త్రవేత్తలుగా ఎదిగి ప్రపంచంలో భారతదేశానికి వన్నె తేవాలన్నారు. పదవ తరగతి వరకు మార్కులు ప్రధానమని ఇంటర్మీడియట్ తర్వాత ఉన్నత చదువుల పరీక్షలే ప్రధానమన్నారు. ఐఐటీ,నిట్, పరీక్షల్లో ఈ 39 మంది విద్యార్థులు సీట్లు సాధించాలని అందుకు కత్రం శ్రీకాంత్ రెడ్డి సహకారం అందిస్తారన్నారు. మాతృభూమి స్వర్గం తో సమానమని జన్మభూమి కోసం శ్రీకాంత్ రెడ్డి ఉన్నత విద్యల అభ్యసించి విదేశాల్లో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం చేస్తున్న కృషిని అభినందించారు. ప్రతిభావంతులుగా తయారుచేసిన ఉపాధ్యాయులను, కష్టపడి చదివిస్తున్న తల్లిదండ్రులను జేడి అభినందించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ తాను ఒకప్పుడు కోదాడ పట్టణంలో పాఠశాల ఫీజు చెల్లించలేక ఇబ్బందులు పడ్డానని, తన మాదిరిగా ప్రతిభ కలిగి ఆర్థికంగా లేని విద్యార్థులు ఇబ్బందులు వద్దనీ ప్రేరణ కోసం స్కాలర్ షిప్ లు అందిస్తున్నామన్నారు. విద్యా, వైద్యం, యువత గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా క్రీడల సాధనకు ప్రోత్సహం ఇవ్వడమే లక్ష్యం అన్నారు. కోదాడ నియోజక వర్గం నుండి 1000 మంది డాక్టర్లు, ఇంజనీర్ల ను తయారు చేయడమే ఫౌండేషన్ లక్ష్యం అన్నారు.పదో తరగతి 2026 వార్షిక పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మొత్తం 39 మంది విద్యార్థులకు రూ.4 లక్షల 20 వేల రూపాయల స్కాలర్ షిప్ అందజేశారు .అందులో భాగంగా మండల స్థాయి ర్యాంకర్లకు (37మంది) ఒక్కొక్కరికి రూ.10వేలు, నియోజకవర్గస్థాయి ర్యాంకర్లకు(ఇద్దరు) రూ.25వేల స్కాలర్ షిప్ లు అందేశారు. అనంతరం మాజీ జేడి విద్యార్ధులతో కలిసి భోజనం చేశారు.రిటైర్డ్ హెచ్ ఎమ్ ముత్తవరపు రామారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కత్రం సీతారామి రెడ్డి, పోటు రంగారావు, ఎంఇఓ లు సలీం షరీఫ్, తల్లడా శ్రీనివాస్, న్యాయవాది దేవబతిని నాగార్జున,పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జితేందర్ రెడ్డి, తీగల నరేష్, కబడ్డీ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నామా నరసింహా రావు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు బంధం వెంకటేశ్వర్లు, బడుగుల సైదులు,కత్రం చారిటబుల్ ఫౌండేషన్ ప్రతినిధులు కత్రం కిరణ్ రెడ్డి, ముడియాల సత్యనారాయణ రెడ్డి, బుడిగ రామాంజనేయులు విద్యార్ధుల తల్లిదండ్రులు ఉన్నారు.



