సర్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలి: కౌన్సిలర్ కాటంరాజు
Mbmtelugunews//కోదాడ, జూన్ 25(ప్రతినిధి మాతంగి సురేష్) : భారత ఎన్నికల సంఘం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేయబడుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో జూన్ 24 నుండి ప్రారంభమై జూలై 24 వరకు నిర్వహిస్తున్నట్లు కౌన్సిలర్ కాటమరాజు తెలిపారు. గురువారం పట్టణ పరిధిలోని రెండవ వార్డు లో సర్ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. పట్టణ పరిధిలోని పోలింగ్ బూత్ 170 నందు ప్రత్యేక ఓటర్ జాబితా ప్రక్రియ సర్ ను కౌన్సిలర్ కాటంరాజు ఎస్ఐఆర్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటంరాజు మాట్లాడుతూ ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు లేకుండా చూడటం, మరణించిన
వారి ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ సర్ ముఖ్య ఉద్దేశమన్నారు. మండల కేంద్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు, తప్పులు లేకుండా బిఎల్ఓ లు పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ప్రతి ఓటరుకు ఎస్ఐఆర్ పత్రం అందజేసి అవగాహన కల్పించి ఓటర్ పక్రియ పూర్తి చేసే విధంగా చూడాలన్నారు. ఎస్ఐఆర్ ఫామ్ లో ఓటర్ ఉద్దేశపూర్వకంగా తప్పుడు సమాచారం అందిస్తే జరిమానా,
జైలు శిక్ష తప్పదని సూచించారు. విధి నిర్వహణలో ఉన్న బిఎల్వోలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని బిఎల్ఓ ల యాప్ లో పొందుపరచాలని సూచించారు. ఓటర్ సవరణ ప్రక్రియకు బిఎల్ఓ లు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓ మాతంగి వెంకటరమణ, ఏజెంట్స్ కనగాల శ్రీధర్, కనగాల పుల్లయ్య, ఎస్డి సలీం, సుల్తానీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు..



