చెరువు మట్టిని పొలాలకు తోలుకోవాలి
: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం, జూన్ 25(ప్రతినిధి మాతంగి సురేష్) : మండల పరిధిలోని చెన్న కేశవపురం గ్రామం లో ఉపాధి హామీ పథకంనందు చెప్పటే చెరువు మట్టి తొలకం పనిని సర్పంచి గోసుల రాజేష్ గురువారం కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ చెరువు మట్టి ని రైతులు తమ పొలంలో పోసుకోవడం వలన భూమిలో ఏ పంట వేసుకొన్న అధిక దిగుబడి వస్తుందని అన్నారు. కావున ఈ అవకాశాన్ని రైతులు ఉపయోగించుకొని వీలైన రైతులు చెరువు మట్టిని వారి పొలాలకు తోలించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి కటికల పుల్లయ్య, గ్రామ పాలక వర్గం, గ్రామ పెద్దలు,టెక్నికల్ అసిస్టెంట్ బి అంజిరెడ్డి, ఫీల్డ్ అసిస్టెంట్ డి అంబేద్కర్ కూలీలు ఉన్నారు.



