ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేస్తున్న బిజెపి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు
Mbmtelugunews// అనంతగిరి,జూన్ 29(ప్రతినిధి మాతంగి సురేష్) : సర్ ప్రక్రియను ఓటర్లకు ఇబ్బంది కలగకుండా తప్పులు తడకలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని బిజెపి సూర్యాపేట జిల్లా ఉపాధ్యక్షులు మల్లెబోయిన వెంకటేష్ బాబు అన్నారు. అనంతగిరి మండల కేంద్రంలో బీఎల్ఓలు ఇంటింటికి తిరిగి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ ప్రక్రియలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం (సర్)జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుంచి బూత్ స్థాయి అధికారులు ప్రతి ఓటర్ కు ఒక జత ఎన్యూమరేషన్ ఫారాలను పంపిణీ చేసి జూలై 24 లోగా ఫారంపై సంబంధిత ఓటరు పేరు,ఎపిక్ కార్డు సంఖ్య,చిరునామా,ఫోటో తదితర వివరాలతో తిరిగి సమర్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అల్లేబోయిన పవన్, నాగరాజు, అంగన్వాడీ టీచర్ ఈదుల నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.



