Sunday, July 5, 2026
[t4b-ticker]

నిరుపేదలకు తక్కువ ఫీజుతో మెరుగైన వైద్య సేవలు అందించాలి.

నిరుపేదలకు తక్కువ ఫీజుతో మెరుగైన వైద్య సేవలు అందించాలి.

:వాణి హాస్పిటల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

:ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి

Mbmtelugunews//కోదాడ, జులై 05(ప్రతినిధి మాతంగి సురేష్) : వాణి హాస్పిటల్ యాజమాన్యం తక్కువ ఫీజుతో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలని కోదాడ శాసన సభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని వాణి హాస్పిటల్ లో చిన్నపిల్లల విభాగాం సేవలను వైద్యులు కంభంపాటి వంశీకృష్ణ నాగరపు ప్రణీత జాస్తి సుబ్బారావు లతో కలిసి ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ..దిన దినాభివృద్ధి చెందుతున్న కోదాడ పట్టణానికి వాణి హాస్పిటల్ ఎంతో ఉపయోగకరం అన్నారు. కోదాడ పట్టణ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మెరుగైన వైద్య సేవలు అందించాలనీ ముఖ్యంగా నిరుపేదలకు తక్కువ ఫీజుతో కార్పొరేట్ వైద్యం అందించి మంచి పేరు తెచ్చుకోవాలని డాక్టర్లకు యాజమాన్యానికి సూచించారు. పేదలకు అతి తక్కువ ఖర్చులో నాణ్యమైన వైద్య సేవలను అందించాలన్నారు.వైద్యులు వ్యాపార పరంగా కాకుండా సేవాభావంతో పనిచేస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని, రాబోయే రోజుల్లో వైద్యం అంటే కోదాడ గుర్తుకు వచ్చేలా పనిచేయాలని గుర్తు చేశారు. వాణి హాస్పిటల్ లో అత్యాధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బంది సేవలు అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ముఖ్యంగా కోదాడ ప్రాంతంలో ఉన్న ప్రజలు దూర ప్రాంతాలకు చిన్నపిల్లల వైద్యుల వద్దకు వెళ్లకుండా వాణి హాస్పిటల్ లోనే చూపించుకోవచ్చు అని తెలిపారు. దీనివలన సమయం డబ్బు ,ఆదాయం అవుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, వైస్ చైర్ పర్సన్ దేవరపల్లి మల్లేశ్వరి, టిపిసిసి డెలిగేట్ చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి, స్థానిక వార్డు కౌన్సిలర్ వాడపల్లి రంగమ్మ వెంకటేశ్వర్లు , జిల్లా గ్రంధాలయ చైర్మన్ వంగవీటి రామారావు, డాక్టర్ కంభంపాటి గురవయ్య విజయ వాణి, డాక్టర్ ప్రమీల శ్రీపతి రెడ్డి, గట్ల కోటేశ్వరరావు, పంది తిరుపతయ్య, కోదాడ పట్టణంలో ఉన్న హాస్పటల్ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular