ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ ప్రాణాలను కాపాడాలి.
:పేపర్ లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.
:డి రవి ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్ ) జిల్లా ప్రధాన కార్యదర్శి.
Mbmtelugunews//కోదాడ, జులై 17(ప్రతినిధి మాతంగి సురేష్): దేశవ్యాప్తంగా జరిగిన పరీక్షల పేపర్ లీకేజీలతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అనిశ్చితిలో పడింది ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ప్రగతిశీల యువజన సంఘం (పివైఎల్)జిల్లా ప్రధాన కార్యదర్శి డి రవి డిమాండ్ చేశాడు. పరీక్షా వ్యవస్థలో చోటుచేసుకున్న అవకతవకలు, పేపర్ లీకేజీలకు నిరసనగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆయన ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలి. ఆయనతో చర్చలు జరిపి సమస్యలకు పరిష్కారం చూపాలి. భవిష్యత్తులో పేపర్ లీకేజీలు జరగకుండా పారదర్శకమైన, విశ్వసనీయమైన పరీక్షా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. పేపర్ లీకేజీలకు పాల్పడిన వారిని, వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలి. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే విధానాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని పి వై ఎల్ డిమాండ్ చేస్తోంది.



