చిన్నారికి జర్నలిస్టుల ఆర్ధిక సహాయం…
Mbmtelugunews//కోదాడ, జులై 21(ప్రతినిధి మాతంగి సురేష్): కాలేయ సమస్యతో ఇబ్బంది పడుతున్న చిన్నారి వడ్లమూడి దక్షిక కు జర్నలిస్టుల సంఘం రాష్ట్ర నాయకులు కారింగుల అంజన్ గౌడ్ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు 15 వేల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని అందజేశారు. కోదాడ పట్టణంలోని గాంధీనగర్ లో నివాసం ఉంటున్న వడ్లమూడి దక్షిక కాలేయం సమస్యతో ఇబ్బంది పడుతుంది. చికిత్స కోసం 30 లక్షలు ఖర్చవుతాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన దక్షిక తల్లితండ్రులు వైద్యం చేపించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాతల సహాయం కోసం తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలో సమస్యను తెలుసుకున్న ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు చిన్నారి ఖర్చుల నిమిత్తం 15 వేల రూపాయల నగదును అందించారు. ఈ కార్యక్రమంలో సలిగంటి మురళి, పిడమర్తి గాంధీ, కుడుముల సైదులు, మరికంటి లక్ష్మణ్, వెన్నెబోయిన పూర్ణ చందర్ రావు, నజీర్, చెరుకుపల్లి శ్రీకాంత్, తోటపల్లి నాగరాజు, గంధం వెంకటనారాయణ, వాసు, సంపత్, పల్లపు శ్రీను, నజీర్, కోలా వెంకట్ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.



