Saturday, July 25, 2026
[t4b-ticker]

విద్యుత్ పంపిణీ పై టిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయటం తగదు : సర్పంచి దున్న శ్రీనివాస్

విద్యుత్ పంపిణీ పై టిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయటం తగదు : సర్పంచి దున్న శ్రీనివాస్

Mbmtelugunews//నడిగూడెం 23(ప్రతినిధి మాతంగి సురేష్): విద్యుత్ పంపిణీ సక్రమంగా జరగటంలేదని
బిఆర్ఎస్ నాయకులు ధర్నాలు చేయటం తగదని నడిగూడెం సర్పంచి దున్నా శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ
ఎల్ నినో ప్రభావం వలన వర్షాలు సకాలంలో రాకపోవటం వలన విద్యుత్ పంపిణీలో టైమింగ్ లో మార్పులు చేయడంతో ఆసరాగా తీసుకొని విద్యుత్ ఇవ్వటం లేదని రైతులను తప్పుదోవ పట్టించే విధంగా ధర్నాలు చేయటం మానుకోవాలన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ తో పాటు గృహాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తుందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ బిల్లుల వసుళ్ళలో విద్యుత్ అధికారులతో గృహాలపై దాడులు చేసి, విద్యుత్తును కట్ చేసిన సందర్భాలు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు అన్నారు. విద్యుత్ పై రైతులను, ప్రజలను తప్పుదోవ పట్టించొద్దన్నారు. రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు హుజూర్ నగర్ కోదాడ నియోజకవర్గాలను అభివృద్ధిలో రాష్ట్రంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉంచేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని, మంత్రి ఉత్తమ్ దంపతులకు ఈ రెండు నియోజకవర్గాల ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారని తెలిపారు. సమావేశంలో ఉప సర్పంచి ఏలుగూరి నాగరాజు, వార్డు సభ్యులు దున్నా శ్రీకాంత్, బాణాల సతీష్ కుమార్, షేక్ రియాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు శ్రీనివాస్, వేపూరి సుధీర్ కుమార్, పందిరి వెంకటరెడ్డి, గడ్డం మల్లేష్ యాదవ్, కాసాని వెంకన్న, గుండు శ్రీను, కంభంపాటి చైతన్య, పుట్టా రమేష్, షేక్ మౌలానా, పాతకోట్ల నాగేశ్వరరావు, కాసాని పుల్లయ్య, కాసాని శివ, దేవరంగుల నాగభూషణం, దున్న దినేష్, గుంజ శ్రీకాంత్, రేపాకుల సందీప్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular