తమ్మర సాయి మందిరంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు
:పురవీధులలో పెద్ద ఎత్తున బాబా ఊరేగింపు
Mbmtelugunews//కోదాడ, జూలై 29(ప్రతినిధి మాతంగి సురేష్) : మున్సిపల్ పరిధిలోని తమ్మర బండపాలెం గ్రామంలో వేంచేసియున్న సాయిబాబా మందిరంలో దేవాలయ కమిటీ నిర్వాహకులు కమతం వెంకటేశ్వరరావు, కమతం రాంప్రసాద్ రావు ఆధ్వర్యంలో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం ఘనంగా వేద పండితులు వేదమంత్రాల మధ్య నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజాము నుండి దేవాలయానికి పెద్ద ఎత్తున సాయి భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజల తండోపతండాలుగా కదిలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా దాతల సహకారంతో దేవాలయ కమిటీ ఏర్పాటు చేసిన మహా అన్నదాన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం మహిళలు కోలాటాల మధ్య మంగళ వాయిద్యాలతో ప్రత్యేక రథంపై బాబా వారిని గ్రామ పురవీధులలో ఊరేగించారు. ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసిన సాయి భక్తులు గ్రామ పెద్దలు పూర్తి సహాయ సహకారాలకు అభినందనలు తెలిపారు.



