ఆషాడంలో గోరింటాకు పండుగ
Mbmtelugunews//కోదాడ, ఆగష్టు 01 (ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని మహిళలందరూ ఆషాడ మాస సందర్భంగావార్డు నెంబర్ ఓరుగంటి రమాదేవి, పొనగళ్ళ విజయలక్ష్మి ల ఆధ్వర్యంలో గోరింటాకు పండుగ కార్యక్రమాన్ని శనివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ ప్రశాంతి, తేజశ్రీలు పాల్గొని ముందుగా గౌరీ దేవికి పూజలు నిర్వహించినారు. అనంతరం చేతులకు గోరింటాకు పెట్టుకొని సందడి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆషాడంలో మహిళలు అత్యంత ఇష్టంగా గోరింటాకు పండుగల జరుపుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తుమాటి ఝాన్సీ, సిహెచ్ లక్ష్మి, చింత మాధవి, వనజమ్మ, నిర్మల, ఓరుగంటి డిష్, పిచ్చుకల రాధా, సౌజన్య, వెంకట్ రావమ్మ, దుర్గ, మమత, పద్మ, తులసమ్మ, అనూష, బెజవాడ వెంకటరావమ్మా, తదితరులు పాల్గొన్నారు.



