అంగన్వాడీల బలోపేతానికి ప్రభుత్వం కృషి : సర్పంచి దున్నా శ్రీనివాస్.
Mbmtelugunews//నడిగూడెం, ఆగష్టు 05(ప్రతినిధి మాతంగి సురేష్): అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి తెలంగాణ ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని నడిగూడెం గ్రామ సర్పంచి దున్నా శ్రీనివాస్ తెలిపారు. బుధవారం మండల కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ 4 నందు చిన్నారికి అన్నప్రాసన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అంగన్వాడి సెంటర్ ద్వారా గర్భిణీలకు, బాలింతలకు, చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తుందని, పౌష్టికారాన్ని స్వీకరించాలని, సరైన సమయంలో తీసుకోవాల్సిన పౌష్టికారాన్ని తీసుకుంటేనే పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నారు. అంగన్వాడి సెంటర్ల ఇబ్బందులను గుర్తించి అంగన్వాడి కేంద్రాలకు ప్రభుత్వం పక్కా బిల్డింగులు మంజూరు చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ సరిత, పాఠశాల ఉపాధ్యాయురాలు నాగమణి, అంగన్వాడి టీచర్లు స్వర్ణ కుమారి, కొండలమ్మ, సవిత, శకుంతల, కవిత, తల్లులు, చిన్నారులు పాల్గొన్నారు.



