Saturday, September 5, 2026
[t4b-ticker]

విద్యుత్ కోతలు రద్దు చేసి 24 గంటల కరెంట్ ఇవ్వాలి……

విద్యుత్ కోతలు రద్దు చేసి 24 గంటల కరెంట్ ఇవ్వాలి…….

:ఖమ్మం క్రాస్ రోడ్ సబ్‌స్టేషన్ గేట్లు మూసివేసి నిరసన తెరిపిన రైతులు……

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 04(ప్రతినిధి మాతంగి సురేష్): వ్యవసాయానికి కరెంట్ కోతలు విధిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే కోతలను రద్దు చేసి 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని తమ్మర రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ సబ్‌స్టేషన్ కు గేట్లు వేసి, గేటు ముందు రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం విద్యుత్ శాఖ ఏడీఈ వెంకన్నను కలిసి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు 24 గంటల విద్యుత్ ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు ఆ హామీని పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు. మొదట్లో 24 గంటలు ఇచ్చి, ఆ తర్వాత 18 గంటలకు, ఆపై 13 గంటలకు తగ్గిస్తూ ప్రస్తుతం కేవలం 9 గంటలకే కోత విధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావంతో వర్షాలు లేక, మరోవైపు కరెంట్ కోతలతో పంటలు పొట్ట దశలోనే ఎండిపోయే పరిస్థితి దాపరించిందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందించకపోతే సబ్‌స్టేషన్లను ముట్టడించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతులు బొల్లు ప్రసాద్, బొల్లు రామకృష్ణ, జాలా కిరణ్ రెడ్డి, పోటు నరేష్, సామినేని సుబ్బారావు, శేషయ్య, వెంకటేశ్వర్లు, పూర్ణచందర్ రావు, వెంకటరామయ్య, బొల్లు నరేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు…….

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular