Saturday, September 5, 2026
[t4b-ticker]

ఘనంగా సెయింట్ మదర్ తెరిసా 29వ వర్ధంతి

ఘనంగా సెయింట్ మదర్ తెరిసా 29వ వర్ధంతి

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 05(ప్రతినిధి మాతంగి సురేష్) : నోబెల్ శాంతి బహుమతి గ్రహీత సెయింట్ మదర్ తెరిసా 29వ వర్ధంతి కార్యక్రమాన్ని యునైటెడ్ పాస్టర్స్ అండ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షుడు ఏసయ్య అధ్యక్షతన కోదాడ మున్సిపల్ ఆవరణలోని మదర్ తెరిసా విగ్రహం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వంగవీటి రామారావు హాజరై మదర్ తెరిసా విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మదర్ తెరిసా పేదలు, నిరాశ్రయులు, కుష్టు వ్యాధిగ్రస్తుల పట్ల అపారమైన ప్రేమతో సేవలు అందించిన గొప్ప త్యాగమూర్తి అని కొనియాడారు. చిన్నతనంలోనే తన జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు సమర్పించుకొని, సమాజంలో అణగారిన వారిని అక్కున చేర్చుకొని, మానవతా దృక్పథంతో సేవ చేసిన మహోన్నత వ్యక్తి అని అన్నారు. మదర్ తెరిసా తన సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచానికి ప్రేమ, కరుణ, మానవత్వం విలువలను చాటిచెప్పారని పేర్కొన్నారు. మదర్ తెరిసా సేవలను స్మరించుకుంటూ, ఆమె చూపిన ప్రేమ, కరుణ, సేవా మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పలువురు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు గుండె పంగు రమేష్, కంపాటి శీను, కుడుముల రాంబాబు, పంది తిరుపతయ్య, కంపాటి పుల్లయ్య, సీనియర్ పాస్టర్స్ సిహెచ్. లూకా కుమార్, సుందర్రావు, అసోసియేషన్ నాయకులు ప్రభుదాస్, రాజేష్, డేవిడ్ రాజారావు, సామ్యూల్, కిరణ్, శాంత వర్ధన్, ఫెలోషిప్ నాయకులు కుర్నేలీ, ఏసుబాబు, హుజూర్నగర్ డేవిడ్, గుడిబండ ఐజయ్య, సుధాకర్, జకరయ్య, మోజస్, రూజువెల్ట్ సాల్మన్, హెడ్‌మాస్టర్ జగ్గు నాయక్ తదితరులు పాల్గొని మదర్ తెరిసా సేవలను కొనియాడారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular