పశు వైద్యుడిని తక్షణమే నియమించాలి.
:పశువుల డాక్టర్ లేక మూగజీవాలు చనిపోతున్నాయి.
:డాక్టర్ లేకపోవడం వలన పశువైద్యశాల బందెలదొడ్డిలా తలపిస్తుంది
:తమ్మర పశు పెంపకం దారులు
Mbmtelugunews//కోదాడసెప్టెంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణ పరిధిలోని తమ్మర గ్రామ పశు వైద్యశాల వద్ద గ్రామ రైతులు (పశు పెంపకందారులు ) కలిసి వచ్చి గత కొన్ని నెలలుగా పశు వైద్యశాలలో పశు వైద్యుడు లేక మూగజీవాలు ఆయిన పశువులు పలు రకాల వ్యాధులతో విలవిలలాడుతూ మృత్యువాత పడుతున్నాయి. గ్రామ పశుపెంపక రైతు సోదరులందరూ పశు వైద్యశాల వద్దకు వచ్చి తమ యొక్క నిరసనను తెలియజేసి తగు అధికారికి వినతి పత్రం ఇచ్చి సమస్యను పరిష్కరించమని కోరినారు. ఇట్టి సమస్యను అతి త్వరగా మా యొక్క గ్రామ పశు వైద్యశాలకు డాక్టర్ ని (పశు వైద్యులను) నియమించాలని కోరుతూ వారికి వినతిపత్రం సమర్పించినారు. డాక్టర్ లేకపోవడం వలన పశు వైద్యశాల పరిసర ప్రాంతాలు బందెల దొడ్డిని తలపిస్తుందని పలువురు వాపోయారు.పశువులు ఒక్కొక్కటి లక్షల పెట్టి కొనుక్కొని వాటి ద్వారా జీవనోపాధి సాగిస్తున్న కుటుంబాలు ఆ పశువులకు ఏమైనా రోగం వస్తే వారు రోడ్డున పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పశువైద్యశాల లో సంబంధిత సిబ్బందిని నియమించి పశు వైద్యశాల కు సంబంధించిన పరికరాలను మందులను అందించాలని పాడి పశువుల రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జంతు ప్రేమికులు, పాడి పరిశ్రమ రైతులు తదితరులు పాల్గొన్నారు.



