Friday, September 11, 2026
[t4b-ticker]

మంగలి తండా గ్రామ పంచాయతీకి మిడ్ వెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేత

మంగలి తండా గ్రామ పంచాయతీకి మిడ్ వెస్ట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఫ్రీజర్ బాక్స్ అందజేత

Mbmtelugunews//కోదాడ, సెప్టెంబర్ 11(ప్రతినిధి మాతంగి సురేష్): మిడ్ వెస్ట్ లిమిటెడ్, హైదరాబాద్ ఆధ్వర్యంలో మండల పరిధిలోని మంగలి తండా గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ బాక్స్‌ను ఉచితంగా అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమం మంగలి తండా సర్పంచి దరావత్ బాబ్జీ నాయక్ సమక్షంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీకి అవసరమైన ఫ్రీజర్ బాక్స్‌ను సంస్థ ప్రతినిధులు అందజేశారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మిడ్ వెస్ట్ లిమిటెడ్ సంస్థ చేపట్టిన ఈ సేవా కార్యక్రమం పట్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసి, సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ అకౌంట్స్ మేనేజర్ శ్రీనివాస్, హెచ్ఆర్ తరుణ్, సైదులు, గ్రామ కార్యదర్శి వెంకటనారాయణ. ఉప సర్పంచి ధరావత్ కృష్ణవేణి హనుమంతు, వార్డు సభ్యులు ధరావత్ కమల కీమా, ధరావత్ జయ జెoథా, ధరావత్ రాజు, మలావత్ వెంకటేశ్వర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular