రైతులకు నాణ్యమైన కరెంటు తోపాటు 12 గంటలు కరెంటు ఇవ్వాలి.
:విద్యుత్ కోతలు పెరిగితే.. రైతు పొలాల్లో పంట కాదు, కన్నీళ్లే మిగులుతాయి.
:ట్రాక్టర్ లో దర్శనమిస్తున్న ట్రాన్స్ఫార్మర్లు.
:విద్యుత్ వ్యవస్థ దుస్థితికి నిదర్శనం.. ట్రాక్టర్లో ట్రాన్స్ఫార్మర్ల తరలింపు.
:రైతులతో చెలగాటమాడుతున్న విద్యుత్ అధికారులు.
Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 07(ప్రతినిధి మాతంగి సురేష్): కరెంట్ కష్టాలు రైతు కన్నీళ్లకు కారణమవుతున్నాయి.. పొలాలు ఎండుతుంటే పంటలపై ఆశలు ఎలా నిలుస్తాయి…విద్యుత్ కోతలు పెరిగితే.. రైతు పొలాల్లో పంట కాదు, కన్నీళ్లే మిగులుతాయి. కరెంట్ కోసం ఎదురుచూస్తున్న రైతు.. నీటి కోసం ఎండిపోతున్న పంట! విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం.. రైతు పంటకు ప్రాణాంతక పరిణామం. కరెంట్ లేక మోటార్లు ఆగుతున్నాయి.. మోటార్లు ఆగితే పంటలు ఎండుతున్నాయి.. రైతు బతుకు ఆగిపోతోంది. పొలాలకు నీరు అందాలంటే విద్యుత్ కావాలి.. విద్యుత్ అందకపోతే రైతు కష్టం వృథా! రైతుకు కరెంట్ కరువైతే.. పంటకు నీరు కరువు.. చివరికి రైతు జీవితమే ప్రశ్నార్థకం. పంటలు ఎండిపోతున్నాయంటే ప్రకృతి ఒక్కటే కారణం కాదు.. విద్యుత్ సరఫరా వైఫల్యమూ కారణమే! కరెంట్ కోతలతో మోటార్లు మూగబోతున్నాయి.. రైతుల ఆశలు వాడిపోతున్నాయి. రైతు పొలానికి విద్యుత్ అందించలేని వ్యవస్థ.. రైతు కష్టానికి ఎలా న్యాయం చేస్తుంది? పలువురు రైతులు వాపోతున్నారు. పట్టణ పరిధిలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో గల సబ్ స్టేషన్ గేట్లు వేసి నిరసన తెలుపుతున్న రైతులు. అదే సమయంలో ఒక ట్రాక్టర్ లో మూడు ట్రాన్స్ఫార్మర్లు వేసుకొని గేటు ముందు ఆగి పలువురినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రైతుల ట్రాన్స్ఫార్మర్లు తీసుకురావడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలం చెందుతున్నారనే ఊహాగానాలు మెండుగానే వినిపిస్తున్నాయి. వారి వాహనాలలో వేలకు వేలు ఖర్చుపెట్టి ట్రాన్స్ఫార్మర్లు తీసుకొస్తుంటే వారికి ట్రాన్స్పోర్ట్ బిల్లు ఎలా వేయించుకోవాలో కూడా తెలియని పరిస్థితి సంబంధిత అధికారులు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. రైతులకు చెందాల్సిన డబ్బు మొత్తం ఎవరి చేతులు మారుతున్నాయని ఊహాగానాలు రైతులలో నిరాశగానే మిగిలిపోయాయి. రైతులకు నాణ్యమైన కరెంటు ఇవ్వకపోవడం వలన మోటర్లు కాలి రైతు నష్టాల బాటలో పడుతున్నాడని ఒక్క సీజన్లోనే రెండు మూడు సార్లు మోటార్లు కాలిన పరిస్థితి ఉందని రైతులు పోతున్నారు. ట్రాన్స్ఫార్మర్ కాలితే రైతు గోస అగమ్య గోచరంగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఆ ట్రాన్స్ఫార్మర్ రావాలంటే 15 రోజులు నుండి నెలరోజుల మధ్య వరకు వేచి చూడాల్సిందే అని పలువురు రైతులు వా పోతున్నారు.

12 గంటలు కరెంటు ఇవ్వాలని ఆ 12 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చి రైతు కన్నీళ్లను తుడ్చాలని పలువు రైతులు వాపోతున్నారు. ఒక్కొక్క రోజు 8 గంటలు అయినా మాకు మెసేజ్ రాలేదని కరెంటు ఇవ్వరు. ఇచ్చిన కరెంటు కూడా పట్టువని గంట కూడా ఉండదు గంట ఇస్తే మళ్లీ అర్ధగంట కోత పెడుతున్నారు అట్లా కోత పెట్టడం వలన రైతు పొలం కూడా సకరంగా పట్టక పట్టిన పొలాలే మళ్లీ పట్టుకుంట పోతుంటే పట్టణ పొలాలు పూర్తిగా ఎండిపోయినాయని పలువురు రైతులు వాపోతున్నారు. ఈ కరెంటు కోతలకు బాధ్యులెవరు రాష్ట్ర ప్రభుత్వము సంబంధిత అధికారుల అని రైతులు ఆపోతున్నారు. ఇకనైనా నాణ్యమైన విద్యుత్ తో పాటు 12:00 విద్యుత్ అందించాలని రైతులు వాపోతున్నారు.



