Friday, October 9, 2026
[t4b-ticker]

కెఎల్ఎన్ యువసేన మిత్రమండల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఓటర్స్ నమోదు

కెఎల్ఎన్ యువసేన మిత్రమండల ఆధ్వర్యంలో గ్రాడ్యుయేట్స్ ఎన్నికల ఓటర్స్ నమోదు

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 9: కోదాడ నియోజకవర్గంలో పలు ప్రాంతాలలో కౌండిన్య గౌడ సంఘం జాతీయ అధ్యక్షులు కేఎల్ఎన్ ప్రసాద్ పిలుపుమేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రతినిధులు గ్రాడ్యుయేట్స్ ఎన్నికల కోసం ఓటర్ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టారు. పలు పాఠశాలలో పలు ఏరియాలలో నిరుద్యోగులను కలిసి గ్రాడ్యుయేట్స్ డిగ్రీ పూర్తి చేసుకున్న వాళ్లని కలిసి స్వయంగా ఫారాలు నింపి అప్లికేషన్స్ ఆన్లైన్ చేసే కార్యక్రమం చేపట్టారు. కౌండిన్య గౌడ సంఘం ఆధ్వర్యంలో మూడు జిల్లాలలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు ప్రతినిధులు తెలిపారు. అదే విధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో సంబంధించి కూడా మా సంఘం ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభించింది అని వారు తెలిపారు. ఎవరికైనా అవసరం ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధులు కారింగుల శ్రీనివాస్ గౌడ్, మద్దికుంట్ల సైదులు, పులి వెంకటేశ్వర్లు, వట్టికూటి శ్రీనివాస్ గౌడ్, బచ్చలకూరి గురువయ్య, బత్తిని సాయి తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular