Saturday, October 10, 2026
[t4b-ticker]

విద్యుత్‌ కోతలతో ఎండిపోతున్న పంటలు.. కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు..

విద్యుత్‌ కోతలతో ఎండిపోతున్న పంటలు.. కాలిపోతున్న ట్రాన్స్‌ఫార్మర్లు, మోటార్లు..

:12 గంటల నాణ్యమైన విద్యుత్‌ రైతుల హక్కు.. హామీలకే పరిమితమైతే ఉద్యమమే మా బాట!

:కరెంటు కోతలతో రైతన్నకు కన్నీళ్లే… నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వకపోతే పోరాటం తప్పదు!.

:వాటర్ ట్యాంకు ఎక్కి, ఎండిన పొలంలో ద్విచక్ర వాహనాలు తోలి నిరసన తెలుపుతున్న రైతులు.

Mbmtelugunews//అనంతగిరి, అక్టోబర్ 10 (ప్రతినిధి మాతంగి సురేష్) విద్యుత్‌ కోతలతో ఎండిపోతున్న పంటలు.. కాలిపోతున్న మోటార్లు.. 12 గంటల నాణ్యమైన విద్యుత్‌ రైతుల హక్కు.. హామీలకే పరిమితమైతే ఉద్యమమే మా బాట అని ఉప సర్పంచి బండ్ల రమేష్ అన్నారు. మండల పరిధిలోని గొండ్రియాల గ్రామంలో రైతులు వినూతన రీతిలో నిరసన తెలిపారు.

Oplus_16908288

గ్రామంలో ఉన్న వాటర్ ట్యాంక్ ఎక్కి, ఎండిన పొలంలో ద్విచక్ర వాహనాలు నడిపి వినూతన రీతిలో నిరసన తెలిపారు. అనంతరం బండ్ల రమేష్ మాట్లాడుతూ రైతులకు 12 గంటల విద్యుత్తు తో పాటు నాణ్యమైన కరెంటు అందించి రైతుల మోటర్లు కాలిపోకుండా ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. 10 గంటలు కరెంట్ ఇస్తే 12సార్లు కరెంటు ట్రిప్ అవుతుందని పట్టిన మడి మళ్లీ పట్టాల్సి వస్తుందని దాని వలన మిగతా మళ్లు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

Oplus_16908288

కరెంటు ఇచ్చిన ఈ 10 గంటలు రైతులు పొలాల వద్ద ఉండే పరిస్థితి ఏర్పడిందని ఎందుకంటే కరెంటు పోయి వచ్చినప్పుడు ఓ వోల్టేజ్ కరెంటు వలన మోటార్లు ఎత్తుకోవట్లేదని దాని వలన రైతు పొలం వద్దనే ఉండే పరిస్థితి ఏర్పడదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా ప్రజాప్రతినిధులు అధికారులు స్పందించి 12 గంటలు నాణ్యమైన కరెంటును అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు, ప్రజలు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular