ఘనంగా బతుకమ్మ సంబరాలు
Mbmtelugunews//నడిగూడెం, అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని చెన్నకేశవపురం లో 9వ రోజు సద్దుల బతుకమ్మ వేడుకను ఘనంగా నిర్వహించారు. సర్పంచి గోసుల రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినటువంటి బతుకమ్మ వేడుకలకు పెద్ద ఎత్తున మహిళలు, ప్రజలు హాజరై ఆటపాటలతో ఘనంగా బతుకమ్మ కార్యక్రమం లో పాల్గొన్నారు. మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మ చేసిన అక్క చెల్లెల అందరికీ సర్పంచి గోసుల రాజేష్ రిటన్ గిఫ్ట్ అందజేయడం జరిగింది కార్యక్రమానికి వచ్చిన గ్రామస్తులందరికీ టిఫిన్ ఏర్పాటు చేయడం కూడా జరిగింది కార్యక్రమాలన్నీ చాలా బాగా జరిగినందుకు గ్రామస్తులందరూ సర్పంచి కి పాలకవర్గానికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



