Sunday, October 18, 2026
[t4b-ticker]

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

:అన్నదానం పుణ్యకార్యం

: సర్పంచి మందుల నాగయ్య

Mbmtelugunews//కోదాడ, అక్టోబర్ 18(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని గుడిబండ గ్రామంలో తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను గ్రామ ప్రజలందరూ కలిసి ఆనందోత్సాహాలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో గ్రామ సర్పంచి మందుల నాగయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తూమాటి వరప్రసాద్ రెడ్డి, ఇర్ల నరసింహారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో వారు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, గౌడ సంఘం సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular