Monday, November 2, 2026
[t4b-ticker]

కంబాల వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మానం

కంబాల వెంకటేశ్వరరావు పదవీ విరమణ సన్మానం

Mbmtelugunews// కోదాడ, అక్టోబర్ 31: మండల పరిధిలోని దోరకుంట గ్రామంలోని జడ్పిహెచ్ఎస్ పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా ఎన్నో సంవత్సరాల పాటు విద్యార్థులకు విద్యాబోధన చేస్తూ, ఎంతోమంది విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసిన కంబాల వెంకటేశ్వరరావు పదవీ విరమణ సందర్భంగా ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచి పాలకి సురేష్ ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, పూర్వ విద్యార్థులు పాల్గొని వెంకటేశ్వరరావు సేవలను కొనియాడారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులకు ఆంగ్ల భాషపై పట్టు సాధించేలా బోధించడమే కాకుండా, క్రమశిక్షణ, నైతిక విలువలు, ఉన్నత ఆశయాలను అలవర్చడంలో ఆయన చేసిన కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ఉపాధ్యాయ వృత్తి ద్వారా సమాజానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, పదవీ విరమణ అనంతరం కూడా ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా కంబాల వెంకటేశ్వరరావుని శాలువా, పూలమాలలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఇట్టి కార్యక్రమంలో హెడ్ మాస్టర్ లింగారెడ్డి, వార్డ్ మెంబర్ జాను, పాఠశాల చైర్మన్ ఫాతిమా, అహ్మద్, పత్తిపాక రామ్మూర్తి, ఆరిఫ్, సైదులు, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular