Monday, November 9, 2026
[t4b-ticker]

విదేశం నుంచి స్వదేశానికి కుమార్తె….

విదేశం నుంచి స్వదేశానికి కుమార్తె….

:ఆత్మీయతల నడుమ దీపావళి సంబరాలు…

:గోపిరెడ్డి నగర్‌లో పండుగ సందడి..

:కుటుంబ సభ్యులతో ఆనందోత్సాహంగా వేడుకలు.

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 09(ప్రతినిధి మాతంగి సురేష్): పట్టణంలోని గోపిరెడ్డి నగర్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావెళ్ల కృష్ణారావు నివాసంలో ఆదివారం దీపావళి పండుగ వేడుకలు ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. ఆయన కుమార్తె లండన్ నుంచి స్వదేశానికి రావడంతో కుటుంబంలో పండుగ ఆనందం రెట్టింపైంది. చాలాకాలం తర్వాత కుమార్తెతో కలిసి దీపావళి జరుపుకునే అవకాశం రావడంతో రావెళ్ల కృష్ణారావు కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి దీపాలు వెలిగించి, టపాసులు కాల్చి, పరస్పరం దీపావళి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కుటుంబ బంధాలు, ఆప్యాయతలు, అనుబంధాలకు ప్రతీకగా నిలిచే పండుగను విదేశాల నుంచి వచ్చిన కుమార్తెతో కలిసి జరుపుకోవడం ఈ ఏడాది తమ కుటుంబానికి మరపురాని అనుభూతిని మిగిల్చిందని వారి ఆనందం వెల్లివిరిసింది. రాజకీయ, సామాజిక కార్యక్రమాలతో నిత్యం బిజీగా ఉండే రావెళ్ల కృష్ణారావు పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular