Friday, November 13, 2026
[t4b-ticker]

సిపిఎస్ రద్దు కోసంనవంబర్ 17న “సామూహిక సెలవు.

సిపిఎస్ రద్దు కోసం
నవంబర్ 17న “సామూహిక సెలవు.

:శాంతియుత నిరసన విజయవంతం చేయండి….

:రాష్ట్ర ప్రభుత్వం సిపిఎస్ రద్దు చేసి, ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి….

:టిఎస్ సిపిఎస్ఈయు సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు.

Mbmtelugunews//కోదాడ, నవంబర్ 13(ప్రతినిధి మాతంగి సురేష్): కాంగ్రెస్ పార్టీ , తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టో లో చెప్పిన విధంగా సిపిఎస్ ను రద్దుచేసి ఓపిఎస్ ను పునరుద్ధరించాలని కోరుతూ శుక్రవారం నాడు పి ఎం శ్రీ జడ్పీ హైస్కూల్ కోదాడ సిపిఎస్ ఉపాధ్యాయులు బడుగుల సైదులు, వేణు కుమార్, సిద్ధిక్, హమీద్, మనోహర్, శ్రీనివాసరావు, నరసింహారావు, దీప్తి సామూహిక సెలవు పత్రాలను గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎండి సలీం షరీఫ్ కి సమర్పించినారు. సిపిఎస్ ఉద్యోగుల సంఘం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బడుగుల సైదులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు సిపిఎస్ రద్దు చేసి, ఓపిఎస్ పునరుద్ధరిస్తామని మేనిఫెస్టోను విడుదల చేసిన నవంబర్ 17 సందర్భాన్ని గుర్తుచేస్తూ, ఇచ్చిన మాటను నిలబెట్టుకొని పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల సంఘం (టిఎస్ సిపిఎస్ఈయు) రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జిల్లా వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు నవంబర్ 17 సామూహిక సెలవు తో శాంతియుత నిరసన పాటిస్తూ విజయవంతం చేయాలని కోరారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular