అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అక్షరాభ్యాసం.
:సర్పంచి పాలకి సురేష్.
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 13(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని ద్వారకుంట గ్రామంలోని అంగన్‌వాడీ 1, 2, 3, 4 సెంటర్ నందు చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి పాలకి సురేష్ పాల్గొని చిన్నారులకు స్వయంగా అక్షరాభ్యాసం చేయించారు.ఈ సందర్భంగా సర్పంచి పాలకి సురేష్ మాట్లాడుతూ చిన్నారుల విద్యాభ్యాసానికి అంగన్‌వాడీ కేంద్రాలు తొలి మెట్టుగా నిలుస్తాయని, బాల్యం నుంచే విద్యపై ఆసక్తి పెంపొందించాలని అన్నారు. ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, పౌష్టికాహారం, మంచి ఆరోగ్యం అందేలా అంగన్‌వాడీ సిబ్బంది కృషి చేయాలని సూచించారు.
చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు విద్య ఎంతో ముఖ్యమని, వారి విద్యాభివృద్ధికి గ్రామపంచాయతీ తరఫున అన్ని విధాలా సహకారం అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కార్యదర్శి వెంకటేశ్వర్లు వార్డ్ మెంబర్ జాన్ అంగన్‌వాడీ టీచర్లు కృష్ణవేణి,నాగమణి,ఆదిలక్ష్మి, అరుణ ,ఆయాలు, చిన్నారులు, తల్లిదండ్రులు, పత్తిపాక రామ్మూర్తి నాగేంద్రబాబు , ఆరిఫ్, లింగం సైదులు తదితరులు పాల్గొన్నారు.



