దాతృత్వాన్ని చాటుకున్న సత్యమేవ జయతే సేవాసమితి
:యాచకులకు దుప్పటి, మంకీ క్యాప్, బుట్ట భోజనం పంపిణీ అభినందనీయం
:సీనియర్ వైద్యులు డాక్టర్ సుబ్బారావు
Mbmtelugunews//కోదాడ, నవంబర్ 16(ప్రతినిధి మాతంగి సురేష్) :సత్యమేవ జయతే సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు నాదెళ్ల బాలకృష్ణ ఆధ్వర్యంలో దేవాలయాల వద్ద, వివిధ కూడలి వద్ద బస్టాండ్ లో ఉంటున్న యాచకులకు దుప్పటి, మంకీ క్యాప్, బుట్ట, భోజనం పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ వైద్యులు డాక్టర్ సుబ్బారావు, సత్యాన్వేషణ మండలి వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్రబాబు లు పాల్గొని యాచకులకు పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ నాదెళ్ల బాలకృష్ణ సత్యమేవ జయతే సేవా సమితిని స్థాపించి ఆ సేవా సమితి ద్వారా కోదాడ పరిసర ప్రాంతాల్లో ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

చలికి యాచకులు ఇబ్బంది పడుతున్నారని గమనించి వారికి దుప్పటి మంకీ క్యాప్ ఒకరోజు భోజనం ఏర్పాటు చేయడం దానికి మేము రావడం మాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజులలో కోదాడ పరిసర ప్రాంతాలలో సత్యమేవ జయతే సేవాసమితి ద్వారా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబాక భాస్కర్, నాదెళ్ల సత్య అనంతలక్ష్మి, ఆర్ నాగేశ్వరరావు, పుష్యమి, రహీం తదితరులు పాల్గొన్నారు.



