అలివేలు మరణం ఆ కుటుంబానికి తీరని లోటు
Mbmtelugunews//నడిగూడెం, జూన్ 03: మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో ఉప సర్పంచ్ కటికల పుల్లయ్య తల్లి అలివేలు వడదెబ్బతో అకాల మరణం చెందినారు. వారి మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన సర్పంచి గోసుల రాజేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బూత్కూరి వెంకటరెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ అలివేలు ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని ప్రార్థించారు. ఆ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని తెలిపారు. అనంతరం ఉపసర్పంచి నీ పరామర్శించి మనోధైర్యాన్ని నింపారు. వీరి వెంట వర్కింగ్ ప్రెసిడెంట్ గుండు శీను, మాజీ ఉపసర్పంచి అనంత ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.



