Thursday, June 25, 2026
[t4b-ticker]

ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో బి ఆర్ అంబేద్కర్ జయంతి

ఎమ్మార్పీఎస్ గ్రామశాఖ ఆధ్వర్యంలో బి ఆర్ అంబేద్కర్ జయంతి

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్): రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల, పిడిత ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి కార్యక్రమం ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సోమపంగు గాంధీ అధ్యక్షన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, గుడిబండ సర్పంచి మందుల నాగయ్యలు పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం
కార్యక్రమాన్ని ఉద్దేశించి వర ప్రసాద రెడ్డి మాట్లాడుతూ సమ సమాజ నిర్మాణం కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం, మహిళ అభివృద్ధి కోసం, అందరికీ సమానమైన విద్యను అందించాలని దేశ పౌరులు విద్య ద్వారా జ్ఞానాన్ని అభ్యసించాలని, దేశ ప్రజలు రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను హక్కులను పొందుకొని ఆర్థిక స్థితిగతులను పెంచుకుంటూ ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ దేశ పురోగతిని సాధించడానికి భారత రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందని రాజ్యాంగంలో ప్రవేశపెట్టిన రిజర్వేషన్ల ద్వారా ఈనాడు ఎస్టి, ఎస్సి సామాజిక వర్గాలు కూడా ఉన్నతమైన పదవులను స్వీకరించడానికి దోహదపడిన రాజ్యాంగాన్ని కొనియాడారు. సర్పంచి మందుల నాగయ్య మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ ద్వారా నేడు గ్రామ సర్పంచిగా గ్రామంలో ఉన్నతమైన పదవిని స్వీకరించడానికి అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ ఫలితమేనని, నేడు ఉన్న భారతదేశ పౌరులందరూ విద్య ద్వారా ఆర్థిక పురోగతిని సాధిస్తూ, నేటి పోటీ ప్రపంచానికి సిద్ధంగా ఉండాలని కొనియాడారు. ఇట్టి ఈ కార్యక్రమంలో ఉప సర్పంచి జయసింహా రెడ్డి, కోదాడ మండల పార్టీ ఉపాధ్యక్షులు సీతారాం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈర్ల నరసింహారెడ్డి, ఎమ్మార్పీఎస్ మండల ఉపాధ్యక్షులు సురవరపు వంశీ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ఎండి రఫీ, పులి గామయ్య, పోయిలపంగు బిక్షం, మాదాసు శ్రీను, పులి బాబు, దార ప్రేమ్ చంద్, పులి ఇస్సాకు, కలకొండ కర్ణాకర్, మాదాసు నాగరాజు, పులి ప్రసాదు, రత్నాకర్, నాగయ్య, బ్రహ్మం, రామకృష్ణ, పవన్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular