కోదాడ అభివృద్ధికి వారి జీవితం అంకితం…
:రాజకీయంగా మరిన్ని పదవులు అధిరోహించాలి.
:రూ.1938 కోట్ల నిధులతో కోదాడ నియోజకవర్గ రూపు మారుస్తున్న ఎమ్మెల్యే పద్మావతి ఉత్తమ్……
:కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, సర్పంచి మందులు నాగయ్య
Mbmtelugunews//కోదాడ, జూన్ 17(ప్రతినిధి మాతంగి సురేష్) : కోదాడ హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధికి వారి జీవితం అంకితం అని కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు తుమాటి వరప్రసాద్ రెడ్డి, సర్పంచి మందుల నాగయ్యలు అన్నారు. మండల పరిధిలోని గుడిబండ గ్రామంలోని తుమాటి వరప్రసాద్ రెడ్డి నివాసంలో స్థానిక శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కోదాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోవడంలో ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కృషి పట్టుదల ఎనలేనిదని కొనియాడారు. రాబోయే రోజులలో మరెన్నో మంచి పదవులు ఆశించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలు తీర్చడంలో ఆమెకు లేరు సాటి అని కొనియాడారు. కోదాడ మండలాన్ని ప్రగతి పథంలో ముందుకు పోతుందంటే ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి కారణమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈర్ల నరసింహారెడ్డి, కుక్కడకు సైదులు, వంశీ, సోమపంగు శ్రీను, పులి పున్నయ్య, కరుణాకర్, గాంధీ, పులి బాబు, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు.



