Tuesday, June 2, 2026
[t4b-ticker]

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం

Mbmtelugunews//కోదాడ, జూన్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): మండల పరిధిలోని రామ లక్ష్మి పురం గ్రామపంచాయతీ కార్యాలయం నందు తెలంగాణ రాష్ట్ర అవతరణదినోత్సవం గ్రామ సర్పంచి గంగిరెడ్డి తులశమ్మ కన్నారెడ్డి నూతన గ్రామ కార్యదర్శి ఉపేందర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగినది. తెలంగాణ ఆవశ్యకత గురించీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు వలన కలిగిన ప్రయోజనాలు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయం కష్టనష్టాలను స్మరించుకుంటూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమరులైన తెలంగాణ పోరాట యోధులకు ఘనంగానివాళులర్పిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీళ్లు నిధులు నియామకాలు పూర్తిగా అర్హులైన తెలంగాణవాదులు ప్రయోజనం చేకూరుతుందని తెలంగాణ రాష్ట్రంలో పాడిపంటలు పుష్కలంగా పండుతున్నాయి ముఖ్యంగా వరి దేశంలోనే ప్రథమ స్థానంగా తెలంగాణ దూసుకుపోతుంది రాష్ట్రంలో వరి ధాన్యం సన్న రకాలకు ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వివరిస్తూ గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలు ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని ఉత్తమ గ్రామపంచాయతీ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోదాడ శాసన సభ్యురాలు పద్మావతి రెడ్డిల విజన్ 2047 రైసింగ్ తెలంగాణ ముందుకు తీసుకెళ్లేందుకు తమ వంతుగా కృషిచేస్తామని
ఈ సందర్భంగా తెలియజేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నెం పాపిరెడ్డి, రామాలయం వైస్ చైర్మన్ నరసింహారెడ్డి, ఉప సర్పంచి సీతారాములు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, ఉపాధ్యాయురాలు సుజాత, వార్డు మెంబర్లు కన్నా రెడ్డి, సుజాత, ధనలక్ష్మి, పాపయ్య, లెక్చర్ భాస్కర్, అంగనవాడి టీచర్లు విమల, స్వరాజ్యం, ఫీల్డ్ అసిస్టెంట్ ప్రమీల, గ్రామ పెద్దలు వెంకటరెడ్డి, సీతారామిరెడ్డి, రామయ్య, వెంకటరెడ్డి, వెంకటరాములు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular