Saturday, April 18, 2026
[t4b-ticker]

చీకటి భారతీయానికి వెలుగునిచ్చిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్

చీకటి భారతీయానికి వెలుగునిచ్చిన మహనీయుడు బిఆర్ అంబేద్కర్

: డా. అంజి యాదవ్

Mbmtelugunews//కోదాడ, ఏప్రిల్ 14(ప్రతినిధి మాతంగి సురేష్):ప్రపంచ మేధావి, న్యాయ శాస్త్ర కోవిదుడు, భారత రాజ్యాంగ రూపశిల్పి, చీకటి భారతీయానికి వెలుగునిచ్చిన మహనీయుడు అని బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ అంజి యాదవ్ అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 జయంతిని పురస్కరించుకొని స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ స్త్రీలకు సమాన హక్కుల కోసం పోరాట చేసిన వీరుడు, రాజ్యాంగ నిర్మాత,భారతదేశ మొట్ట మొదటి న్యాయశాఖ మంత్రివర్యులు, ప్రసిద్ధ ఆర్థిక శాస్త్రవేత్త,రాజకీయ దార్శనికుడు,
సంఘ సంస్కర్త, విధ్యా ప్రదాత అసమానతలు అంటరానితనం నిర్మూలన కోసం తిరుగుబాటు జెండా ఎగరేసి బోధించు, సమీకరించు, పోరాడు అంటూ జన ప్రభంజనాన్ని జాగృతం చేసిన సామాజిక విప్లవకారుడు అనగారిన వర్గాల ఆశాజ్యోతి అని అన్నారు. సమతావాది, స్వతంత్ర సమరయోధుడు, మన చేతులకు యుద్ధం – వేళ్ళకు పోరాటం నేర్పిన మహనీయులు భారతరత్న బాబా సాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గుండు రాహుల్, కతిమాల వెంకన్న, గగన్ తేజ్, శ్రీకాంత్, నవీన్, మల్లేష్, సురేష్, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisment -spot_img
- Advertisment -spot_img
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular