పచ్చిగొల్ల సర్వయ్య కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటాది
: సర్పంచి గోసుల రాజేష్
Mbmtelugunews//నడిగూడెం,ఆగష్టు 05(ప్రతినిధి మాతంగి సురేష్): నడిగూడెం మండల పరిధిలోని చెన్నకేశవపురం గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త పచ్చిగొల్ల సర్వయ్య మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని సర్పంచి గోసుల రాజేష్ పర్మర్శించి సర్వయ్య కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటానని చెప్పి 5000 రూపాయలు ఆర్థిక సాయం వారి కుమారుడు పచ్చిగోళ్ళ నరేష్ కి అందజేయడంజరిగింది. సర్వే కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటదని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచి అనంతుల ఉపేందర్, వార్డు సభ్యులు పప్పుల ఉపేందర్, పచ్చిగొల్ల స్వరూప, ఆర్ఎంపీ డాక్టర్ కొత్త ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.



