భూమి లేదని రెవెన్యూ అధికారులు తేల్చి చెప్పినప్పటికీ వివాదాల సృష్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
Mbmtelugunews//కోదాడ, ఆగస్టు 06 : సూర్యాపేట జిల్లా మునగాల మండలం నరసింహపురం గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 591 భూమి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. తమ పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూమిపై కొందరు కావాలనే వివాదం సృష్టిస్తూ, సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని భూమి యజమానులు ఆరోపించారు. గతంలో రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి తమకు అనుకూలంగా నివేదిక ఇచ్చారని వారు తెలిపారు. సర్వే నంబర్ 591లోని భూమి కారింగుల కాశయ్య నుంచి వారసత్వంగా కారింగుల రామయ్య, వీరయ్య, వెంకటనారాయణ, లక్ష్మయ్యలకు వచ్చిందని, అనంతరం వారి వారసులకు సంక్రమించిందని భూమి యజమానులు తెలిపారు.
2010-11 సంవత్సరంలో కారింగుల లక్ష్మయ్య నుంచి పందిరి నాగిరెడ్డి సుమారు ఎకరం భూమిని కొనుగోలు చేశారని చెప్పారు అలాగే. కుక్కడకు శ్రీను దగ్గర నుండి కారింగుల పాపయ్య దగ్గర నుండి కొంత భూమి కొనుగోలు చేశారు కావాలని పందిరి నాగిరెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలని ఒక యూట్యూబ్ ఛానల్ అడ్డుపెట్టుకొని తనపై చెడు ప్రచారం చేస్తున్నారని భగత్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులకు నీళ్ల కోసం బోరు వేయిస్తుంటే ఆ బోరు వేయించకుండా నానా ఇబ్బందులు గురిచేసారని తెలిపారు. నరసింహాపురం గ్రామపంచాయతీ కార్యాలయంలో పన్నులు చెల్లిస్తున్నామని కావాలనే మాపై రాజకీయంగా దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. అయితే కారింగుల బిక్షం, వెంకమ్మ, కుక్కడపు నాగమణి, వినయ్ తదితరులు కావాలనే తమ భూమిపైకి వస్తూ, సోషల్ మీడియాలో తమపై అసత్య ప్రచారం చేసి పరువు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గతంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డీవో, ఎమ్మార్వో ఆధ్వర్యంలో సర్వే నిర్వహించగా, కారింగుల బిక్షం, వెంకమ్మలకు ఎలాంటి ఆధారాలు లేవని, ఈ భూమిపై వారికి హక్కులు లేవని అధికారులు తేల్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికైనా
అసత్య ప్రచారం నిలిపివేసి, తమ భూమిపై ఎలాంటి జోక్యం చేసుకోకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని భూమి యజమానులు కోరుతున్నారు.



