రక్తదానం మహా దానం
:అన్ని దానాల కంటే రక్తదానం గొప్పది
Mbmtelugunews//కోదాడ, మే 08(ప్రతినిధి మాతంగి సురేష్) : అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తదానం చేసినట్లయితే మరి ఒకరి ప్రాణం కాపాడవచ్చు అని ఎంబిఎం ట్రస్ట్ సభ్యులు అన్నారు అన్నారు. కోదాడ పట్టణానికి చెందిన రోశమ్మ జ జారిపడింది. ఈ ప్రమాదంలో కాలు విరగటంతో కోదాడ కొత్తమాస్ జనార్ధన్ ఆర్థోపెడిక్ హాస్పిటల్ నందు శుక్రవారం ఆపరేషన్ నిర్వహించటానికి అత్యవసరంగా ఓ నెగిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో మునగాల మండలం నరసింహపురం గ్రామానికి చెందిన బొమ్మ సాయి వారికి బ్లడ్ ఇచ్చారు. సాయికి రోషమ్మ కుటుంబం సభ్యుల తరఫున ప్రత్యేకమైన వారికి ధన్యవాదాలు అభినందనలు తెలిపారు. బొమ్మ సాయి ఇప్పటివరకు 11 సార్లు బ్లడ్ ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నాడు ఈ కార్యక్రమంలో ఎంబీఎం ట్రస్ట్ సభ్యులు, పేషెంట్ బంధువులు తదితరులు పాల్గొన్నారు.



