శ్రమశక్తి అవార్డు గ్రహీత నాదెళ్ల బాలకృష్ణ
:నాదెళ్ల బాలకృష్ణ సేవా కార్యక్రమాల వలన అవార్డులు
Mbmtelugunews//కోదాడ, మే 01( ప్రతినిధి మాతంగి సురేష్): ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని కోదాడ రూరల్ లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న నాదెళ్ల బాలకృష్ణ ను శ్రమశక్తి అవార్డు కు ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డు రవీంద్ర భారతి హైదరాబాదులో కార్మిక మంత్రి వివేక్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది. అనంతరం నాదేళ్ళ బాలకృష్ణ మాట్లాడుతూ
కష్టాన్ని ఇష్టంగా మార్చకుంటూ మీ ఆలోచనలకు నిరంతరం పదును పెడుతూ ఇటు సంస్థని అటు సంఘాన్నే కాకుండా సమాజా అభివృద్ధికి కూడా నిరంతరం పాటుపడి నందుకుగాను నా శ్రమను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రమ శక్తి అవార్డు ఇవ్వడం జరిగిందని అన్నారు.

ఈ అవార్డు నాకు ఇంకా మరింత బాధ్యతను పెంచిందని ఆ బాధ్యతను నిర్వర్తించడంలో వెనకడుగు వేయనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ అవార్డు నన్ను వరించడానికి సహకరించిన తోటి ఉద్యోగస్తులకు, కన్జ్యూమర్స్ కు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.



