సోనియాగాంధీ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర సాధన
:సర్పంచి లిక్కి గురవమ్మ వెంకటయ్య
Mbmtelugunews//కోదాడ, జూన్ 02(ప్రతినిధి మాతంగి సురేష్): సోనియాగాంధీ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని సర్పంచి లిక్కి గురవమ్మ వెంకటయ్య అన్నారు. మండల పరిధిలోని తొగర్రాయి గ్రామపంచాయతీ ఆవరణంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచి లిక్కీ గురవమ్మ వెంకటయ్య పాల్గొని జెండా ఎగరవేసి అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ 2010లో శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటై ఆరు ప్రతిపాదనలు చేసింది. ఆ ప్రతిపాదనలతో 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణ కొరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయడం జరిగిందని అన్నారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ఆదేశిస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టిందని అన్నారు. మంత్రి ఉత్తమ్ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో
దేవాలయం కమిటీ చైర్మన్ పగిడిమరి సరస్వతి మదన్ మోహన్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పులి సులోచన రావు, గ్రామ శాఖ అధ్యక్షులు వెంకటేష్, వేలాద్రి, ఏడుకొండలు, చిన్న వేంకన్న, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు అమరబోయిన శ్రీనివాసరావు, వార్డ్ నెంబర్ నరేష్, కిషోర్, వీరయ్య, నాగమ్మ, కనకలక్ష్మి, ఏడుకొండలు, పంచాయతీ కార్యదర్శి నరేందర్ రెడ్డి, అంగన్వాడి టీచర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



