కోదాడ,ఆగష్టు 20(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకుంటున్న సీఎం కేసీఆర్ ఆర్థిక నేరగాడని ఆర్థిక నేరాల కింద సీఎం కేసీఆర్ ను వెంటనే అరెస్టు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు మాజీ మంత్రి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్ చెప్పారు.ఆదివారం కోదాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళుతుండగా పోలీసులు తనను కోదాడలోనే అడ్డుకున్నారని బూట్ల సవ్వడి లేని తెలంగాణ ఏర్పాటు చేస్తామని ఇప్పుడు పోలీసులతో నిర్బంధాలు ఎందుకు చేపిస్తున్నారు అని ప్రశ్నించారు.అవినీతికి పాల్పడితే రాళ్లతో కొట్టాలని అన్న కెసిఆర్ నేడు అవినీతి చేస్తూ తెలంగాణ ప్రజలకు భయపడి బాత్రూం కి కూడా బుల్లెట్ ప్రూఫ్ ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు.ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు దళితునికి సీఎం పదవి,మూడు ఎకరాల భూమి,ఇంటికో ఉద్యోగం,కేజీ టు పీజీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు 29 లక్షల కోట్ల రాష్ట్ర బడ్జెట్ దిగమింగారని విమర్శించారు.కాగ్ నివేదిక సహితం తెలంగాణ రాష్ట్రంలో అవినీతి జరిగిందని వెల్లడించిందన్నారు.ఆర్థిక నేరం కింద సీఎం కేసీఆర్ ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.కెసిఆర్ కుటుంబం లక్షల కోట్లు మింగుతూ ఫామ్ హౌస్ కట్టించుకున్నారని ఆ కుటుంబానికి ఇన్ని ఫామ్ హౌస్ లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.గవర్నర్ కు ప్రోటోకాల్ ఇవ్వకుండా మహిళాని చూడకుండా అవమానాలకు గురి చేస్తున్నారన్నారు హైదరాబాదులో జరిగిన సభలో ప్రధాని మోడీ కెసిఆర్ అవినీతి కుటుంబానికి ఉచ్చు బిగిస్తున్నామని చెప్పారని అది త్వరగా చేయాలని కోరారు.కాలేశ్వరం ప్రాజెక్టు మిషన్ భగీరథ పథకాల్లో 1500 కోట్లు అవినీతి జరిగిందన్నారు.రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని కళ్యాణ్ లక్ష్మీ షాదీ ముబారక్ రైతుబంధు ఆగిపోతున్నాయన్నారు.తాను కెసిఆర్ కంటే సీనియర్ రాజకీయ నాయకుడిని నాడు సీఎం కేసీఆర్ దివాలా తీసి నేడు ముఖ్యమంత్రి అయి లక్షల కోట్లు సంపాదించారని విమర్శించారు.కెసిఆర్ ఉసు అంటే పోలీసులు డిస్కో అంటున్నారని ఎద్దేవ చేశారు.రాబోయే ఎన్నికల్లో కెసిఆర్ అవినీతిని ఎండగట్టి రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.నియోజకవర్గ ఇన్చార్జి కనగాల నారాయణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఓ వి రాజు,ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బోలిశెట్టి కృష్ణయ్య,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్,బిజెపి పట్టణ అధ్యక్షులు సాతులూరి హనుమంతరావు,పుల్లయ్య,కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు
బూట్ల సవ్వడి లేని తెలంగాణ అన్నారు పోలీసులతో నిర్బంధాలు ఎందుకు చేస్తున్నారు.:గులాబీ చీడ కేసీఆర్ మాజీ మంత్రి మాజీ ఎంపీ రవీంద్ర నాయక్.
RELATED ARTICLES



