కోదాడ,నవంబర్ 08(mbmtelugunews(ప్రతినిధి మాతంగి సురేష్:నేడు సామినేని ప్రమీల రమేష్ కాంగ్రెస్ పార్టీలో చేరినారు.రేపు మాపో జలగం సుధీర్ రావు ప్రయాణం ఎటో..? కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేరితే తెలంగాణ ఉద్యమం నాటి నుండి నేటి వరకు బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ కోదాడ నియోజకవర్గం తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించిన ఎన్నారై జలగం సుధీర్ రావు.

కోదాడ నియోజకవర్గంలో గత నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యే చందర్ రావుకు అత్యంత దగ్గర బంధువు కావడం వలన మాజీ ఎమ్మెల్యే సహకారంతో కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పలువురు వాపోతున్నారు.



