కోదాడ,నవంబర్ 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:కోదాడ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల బరిలో టీపీసీసీ ఉపాధ్యక్షురాలు,కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పద్మావతి రెడ్డి తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు.ఈ సందర్భంగా మొత్తమ్ పద్మావతి మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికలలో చేయి గుర్తుకు ఓటేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ పాలనే కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన 6 గ్యారంటీలను తప్పకుండా నెరవేరుస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ సభ్యులు, హుజూర్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఉత్తమ్ కుమార్ రెడ్డి,కోదాడ మాజీ శాసనసభ్యులు వేనేపల్లి చందర్ రావు,పార సీతయ్య,చింటకుంట్ల లక్ష్మారెడ్డి తో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.



