కోదాడ,డిసెంబర్ 09(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటుకు కృషిచేసిన కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ జన్మ దినోత్సవ వేడుకలను కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ ఆధ్వర్యంలో కోదాడలోని స్థానిక రాధాకృష్ణ వికలాంగుల ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా షేక్ రఫీ మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన సోనియా జన్మదినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించవలసిన బాధ్యత ప్రతి కాంగ్రెస్ నాయకుల పై ఉందని ఆ క్రమంలో భాగంగానే తాను సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలను మానసిక వికలాంగుల కేంద్రంలో నిర్వహించి మానసిక వికలాంగులకు పండ్లు పంపిణీ చేయడంతో పాటు కేక్ కట్ చేసి ఘనంగా సోనియా గాంధీ జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించామని అన్నారు.సోనియా గాంధీ జన్మదినోత్సవం రోజునే కోదాడ నియోజకవర్గ శాసనసభ్యురాలు పేదల పెన్నిధి ఉత్తమ్ పద్మావతి అక్క ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేయడం తమకెంతో ఆనందదాయకమని ప్రజా సంక్షేమ ధ్యేయంగా నాడు దేశ రక్షణ కోసం నేడు ప్రజా సంక్షేమం కోసం యుద్ధం యుద్ధ వీరుడిలా ముందుకు ప్రజా నాయకుడు రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయుటము తమ వికలాంగుల సమాజానికి ఎంతో ఆనందదాయకమని అన్నారు.ఉత్తమన్న ఆదేశాలు పద్మక్క ఆలోచనలు ప్రజలకు తెలియజేస్తూ ప్రజా సంక్షేమం కోసం చేస్తున్న కృషిని ప్రజాస్వామ్యానికి వివరిస్తున్న చింతకుంట్ల లక్ష్మినారాయణ రెడ్డి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల వెంట ఉండే నాయకుడు కోదాడ కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షులు వంగవీటి రామారావు సహకారంతో ఇట్టి జన్మదినోత్సవ వేడుకలను నిర్వహించడం జరిగిందని కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర నాయకులు షేక్ రఫీ తెలిపారు.ఈ కార్యక్రమంలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్,కాంగ్రెస్ పార్టీ నాయకులు దొంతగాని అంజయ్య గౌడ్,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ నాయకులు చింతకుంట్ల సూర్యం,కోదాడ మున్సిపాలిటీ మైనార్టీ సెల్ రెండో వార్డు అధ్యక్షులు షేక్ నాగుల్ మీరా తదితరులు పాల్గొన్నారు.
శనగల రాధాకృష్ణ వికలాంగుల ఆశ్రమంలో తెలంగాణ తల్లి సోనియాగాంధీ జన్మదిన వేడుకలు
RELATED ARTICLES



