కోదాడ,డిసెంబర్ 14(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రాష్ట్ర పౌరసరఫరాల,నీటిపారుదల శాఖమంత్రివర్యులు నలమాద ఉత్తమ్ కుమార్ రెడ్డిని మరియు కోదాడ శాసనసభ్యులు నలమాల పద్మావతి రెడ్డిని హైదరాబాద్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా పరిషత్ సోషల్ అండ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్,నడిగూడెం జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేడు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను పకడ్బందీగా అమలు చేస్తారని తెలిపారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వెస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మహిళా ప్రధాన కార్యదర్శి కన్నెబోయిన ఉదయశ్రీ,కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండు విజయరామరావు తదితరులు పాల్గొన్నారు.
ఉత్తమ్ దంపతులను కలిసిన జిల్లా పరిషత్ సోషల్ అండ్ వెల్ఫేర్ స్టాండింగ్ కమిటీ చైర్పర్సన్ బాణాల కవిత నాగరాజ్ మరియు కాంగ్రెస్ నాయకులు
RELATED ARTICLES



