కోదాడ,ఫిబ్రవరి 17(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:స్వేరోస్ నెట్వర్క్ కోదాడ మండల కమిటీని కోదాడలోని శిల్పి రెస్టారెంట్లో ఎన్నుకోవడం జరిగింది.మండల కమిటీ అధ్యక్షునిగా రామలక్ష్మీ పురానికి చెందిన పాముల రాకేష్ స్వేరో,ప్రధాన కార్యదర్శిగా చెరుకుపల్లి గోపి స్వేరోఎన్నికైనట్లు జిల్లా జాయింట్ సెక్రెటరీ నాగార్జున స్వేరో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చెరుకుపల్లి కిరణ్ స్వేరో మాట్లాడుతూ అక్షరం ఆరోగ్యం ఆర్థికం ఎంతో ముఖ్యమైనవని స్వేరోస్ సమాజానికి ఈ మూడింటిని అందించడం ద్వారా దేశం అభివృద్ధి చెందుతుందని స్వేరోస్ అందరూ వీటిని అలవర్చుకొని దేశ ప్రజలకు వాటిని అందించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో విజయనిర్మల,జ్యోతి రాణి,సుధాకర్,సుజాత,ఇమ్రాన్,ఇర్ఫాన్,ఉదయం శ్రీ,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
స్వేరోస్ కోదాడ మండల కమిటీ ఎన్నిక
RELATED ARTICLES



