కోదాడ,మార్చి 25(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:సేవ దృక్పథంలో దేవపంగు సాయికుమార్ కి ఏసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ కోయంబత్తూర్ వారు గౌరవ డాక్టరేట్ ను సత్కరించటం జరిగింది.స్థానిక ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి రాష్ట్ర నాయకులు కొండపల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో దేవపంగు సాయి కుమార్ గృహం యందు ఘనంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ కౌన్సిలర్ బెజవాడ శిరీష శ్రావణ్ పాల్గొని సన్మానించారు.అనంతరం కొండపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ కోదాడకు చెందిన మాదిగ బిడ్డకు డాక్టరేట్ రావటం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు.ఇంకా భవిష్యత్తులో దళితులు ఇలాంటి ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని కోరారు.ఈ కార్యక్రమంలో బెజవాడ శ్రావణ్ యువసేన సభ్యులు కత్తి భగత్,కుడుముల రవి,చింతా కుమారు,దేవపంగు పవన్,బైరు శ్రీను,కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దేవపంగు సాయికుమార్ కు ఘన సన్మానం
RELATED ARTICLES



