:రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి:ఎంబిఎం ట్రస్ట్
కోదాడ,మార్చి 31(mbmtelugunews) ప్రతినిధి మాతంగి సురేష్:రక్తదానం చేయండి మరి ఒకరికి ఉన్ప్రాణదాతలుగా నిలబడండి అని ఎంబిఎం ట్రస్టు సభ్యులు ఆదివారం హుజూర్ నగర్ విష్ణు హాస్పిటల్ లో తరుణ్ హుజూర్ నగర్ వారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో తెలుసుకున్న ఎంబిఎం గ్రూప్ సభ్యులైన కోదాడ మండలం తొగర్రాయి గ్రామానికి చెందిన చిన్నపంగు విజయ్ కుమార్ వారి కుమార్తె చిన్నపంగు కాజల్ విజయ్ పుట్టినరోజు సందర్భంగా వారికి బ్లడ్ ఇచ్చారు.

ఈ సందర్భంగా గ్రూపు సభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఎంతోమందికి రక్తం అందించడానికి సహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.చిన్నపంగు విజయ్ కుమార్ గత మూడు సంవత్సరాల నుండి వాళ్ళ పాప పుట్టినరోజుని పురస్కరించుకొని ఎంబీఏం ట్రస్టు ద్వారా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది వారికి ఎంబిఎం ట్రస్టు సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంబిఎం ట్రస్ట్ సభ్యులు మాతంగి సురేష్,ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



