కోదాడ,ఏప్రిల్ 03(mbmtelugunews)ప్రతినిధి మాతంగి సురేష్:గత కొన్ని రోజుల నుండి ఆంధ్ర నుండి వచ్చే ఇసుక టిప్పర్లపై కోదాడ పోలీసులు జూలుమ్ ప్రదర్శించి కేసులు చేస్తున్న లెక్కచేయకుండా ఆంధ్రా నుండి ఇసుక టిప్పర్లు తెప్పిస్తున్న ఇసుక ఏజెంట్లు.బుధవారం కోదాడ రూరల్ పరిధిలో తొగర్రాయి వద్ద ఆంధ్ర ఇసుక టిప్పర్ ని రూరల్ పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం.

ఈ టిప్పర్ హుజూర్ నగర్ లోని డబల్ బెడ్ రూమ్ (ఇందిరమ్మ)ఇండ్లకు వెళుతున్నట్లు సమాచారం.ఈ టిప్పర్ లో సుమారు 35 టన్నుల ఇసుకని పంపిస్తున్నట్లు సమాచారం.ఇసుక టిప్పర్ ని ఆంధ్ర నుండి తెలంగాణకు ఎవరు తీసుకొస్తున్నారు అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.



